Tuesday, 28 August 2012

సెల్ రీచాజ్

హలో ఫ్రెండ్స్,
ఈ మధ్య సెల్ వాడకం బాగ ఎక్కువ గా ఉంది.
దాని  వల్ల ఎన్నో రీచాజ్ సెంటర్స్ వచ్చాయి.
ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పేది ఏమిటంటే : రీచాజ్ చేయించుకునేటప్పుడు పేపర్ రీచాజ్ చేయించుకోండి
                                    లేదా
 మీ అన్నయ, తమ్ముడు, నాన్న వారిచేత రీచాజ్ చేయించమని చెప్పండి.

కారణం: రీచాజ్ సెంటర్ లొ సెల్ రీచాజ్ చేయించుకుంటున్నకొంత మంది అమ్మాయిల నెం అపరచితుల చేతుల్లోకి వెళుతున్నాయి.
కొంత మంది అమ్మాయిల సెల్ నెం  కాల్ గల్స్ సైట్ లో పెడుతున్నారు.



Monday, 27 August 2012

ఆచరణ

ఈ రోజుల్లో అందరు టివి ల ముందు కూర్చుని, వెంకటేశ్వరా భక్తి, తితిదే చానాల్ చాలా శ్రద్ధగా వింటున్నారు,

ఇక ఆచరణ విషయం లోకి వచ్చేసరికి ఎంత మంది ఆచరిస్తున్నారు??

ఉదా: రామాయణం తీసుకోండి, అందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి.

Human Relations, Leadership Qualities......... ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి.

Human Relations (మానవ సంబంధాలు) : ఈ రోజులో ఎంత మంది పిల్లలు తమ తల్లితండ్రులను,  గురువులను గౌరవిస్తున్నారు??
 నేటి తరం పిల్లలకు, అత్త, మామయ్య, పిన్ని, బాబాయి, పెద్దమ్మ, పెద్దన్నాన్న, అని పిలుస్తున్నారా????  ఎంత మంది తల్లితండ్రులు వారి పిల్లలకి వీళ్ళు బాబాయి, పిన్ని, ...................... అలా అని చెప్తున్నారు!!!! అంకుల్, ఆంటీ అని తప్ప!!!!!!!!!

ఇలా ఎన్నో విషయాలు పైన తెలిపిన చానల్స్ లొ చెప్పే పురాణాల ద్వారా తెలుస్తున్నాయి, అందరూ గంటలు తరబడి టివి ముందు కూర్చుని ఆ ప్రసంగాలని విని ఊరుకోవటం తప్ప ఎవరు ఆచరిస్తున్నారు?? ఏదో కాలక్షాపానికి వింటున్నారు అంతే!!!
నా ఉద్దేశం : అవి విని ఊరుకోవటం  కాకుండా ఒక్క విషయమైనా ఆచరిస్తే సమాజానికి మేలు చేసిన వారు అవుతారు