Tuesday, 5 February 2013
కోపం
ఈ రోజు ఆటో రాంగ్ రూట్ లో వస్తూ ఉంటే ట్రాఫిక్ కానిస్తేబుల్ ఆ ఆటో ఆపి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియదా?? అని కోపంగా అడిగాడు, అందుకు ఆ ఆటో అతను కొంచెం పొగరుగా, కోపంగా ముందు మీరు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయండి అప్పుడు మాకు నీతులు చెప్పండి అని దబాయించాడు, అందుకు ఆ ట్రాఫిక్ కానిస్తేబుల్ కి కోపం వచ్చి ఆటోకి నెం ఫోటో తీసాడు.
చలాన్ ఇంటికి పంపిస్తాను అని చెప్పి ఆటో అతన్ని పంపాడు.
కోపం ఎంత పని చేసింది.
మన దగ్గర ఏమి ఉన్నా లేక పోయినా కోపం ఉండకూడదు.
ప్రభుత్వరంగ బ్యాంక్
రెండు రోజుల క్రితం ఒక ప్రభుత్వరంగ బ్యాంక్ కి వెళ్ళాను,
అదీ ఎకౌంట్ స్తేట్ మెంట్ కొసం, ఆ స్తేట్ మెంట్ ఇవ్వటానికి ఎంత భాదపడుతూ ఇచ్చారు.
అంటే ఎదో వాళ్ళకి పని చెప్పినందుకు భాధ పడుతూ నన్ను తిట్టుకుంటూ, తీరా స్తేట్ మెంట్ రెండు రోజులు తిప్పించుకుని ఇచ్చారు. గౌరవనీయులైన బ్యాంక్ మేనేజరు గారు ఎంత మంచి వారో . . . (ఆయన కొంచెం, పద్దతిగా మట్లాడారు)
ప్రభుత్వరంగ బ్యాంక్ పని చేయటానికి ఎందుకో అంత భాధ (అందరికి కాదు, కోంత మందికి మాత్రమే).
పని చేయటానికి చిరాకు, కోపం (ఎందుకో తెలియదు)
మనుషులు ఎప్పుడు మారతారో . . . .
Subscribe to:
Posts (Atom)